¡Sorpréndeme!

GT vs MI 197 Target Match Highlights IPL 2025 | మొన్న చెన్నై, నిన్న ముంబై సరిగ్గా అలాగే ఓడిపోయాయి | ABP Desam

2025-03-30 1 Dailymotion

 క్రికెట్ లో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు జరుగుతాయి. వాటిని అస్సలు నమ్మలేం కానీ జస్ట్ కో ఇన్సిడెన్స్ గా చెప్పుకోవటానికి భలే బాగుంటాయి. అచ్చం అలాంటిదే మొన్న చెన్నైకి, నిన్న ముంబైకి జరిగింది. నిన్న గుజరాత్ విసిరిన 197 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక 36పరుగుల తేడాతో విజయాన్ని గుజరాత్ కు అప్పగించింది ముంబై. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ను గుజరాత్ కు అప్పగించింది ముంబై. సాయి సుదర్శన్ 63పరురుగుల, శుభ్ మాన్ గిల్, జోస్ బట్లర్ 30+ స్కోర్లతో ఫర్వాలేదనిపించటంతో గుజరాత్ టైటాన్స్ 8 వికెట్ల నష్టానికి 196పరుగులు చేసింది. ఇప్పుడు 197పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేయలేక నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 160 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది ముంబై. మొన్న కూడా అంతే ముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ సరిగ్గా 196పరుగులే చేసి 197 పరుగులు టార్గెట్ ఇస్తే...ఛేజింగ్ చేయలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్ 146పరుగులే చేసి 50పరుగులతో తేడాతో విజయాన్ని ఆర్సీబీకి ఇచ్చేసింది చెన్నై. ఇలా వరుసగా రెండు రోజుల్లో రెండు టీమ్స్ కి 197పరుగులే టార్గెట్ రావటం ఓ విచిత్రమైతే...ఆ టార్గెట్ ను చెన్నై, ముంబై రెండూ ఛేజ్ చేయలేకపోవటం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. గుజరాత్ మీద మ్యాచ్ ఓడిపోవటానికి ముందు మ్యాచ్ ముంబై చెన్నై పైనే ఆడటం మరో విచిత్రం. ఇలా 197 అనే నెంబర్ మిస్టరీ అంకెలా మారి ఐదుసార్లు కప్పులు గెలిచిన రెండు ఛాంపియన్ జట్లకు శాపం పెట్టిందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫన్నీగా ట్రోల్ చేస్తున్నారు